చల్లపల్లి స్వరూపరాణి తొలి దళిత స్త్రీవాద రచయిత్రిగా ప్రసిద్ధి చెందింది.
ఈమె 1970, మే 25నగుంటూరు జిల్లా, ప్యాపర్రు గ్రామంలో మంత్రయ్య, మరియమ్మ దంపతులకు జన్మించింది.[1] ఈమె కథలు, కవితలు వ్రాసింది. ఈమె వ్రాసిన కొన్ని రచనలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి తర్జుమా అయ్యాయి.
ఈమె 1992లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ప్రాచీన భారత చరిత్ర & పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ. పట్టా పొందింది. 1996లో హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో ఎం.ఫిల్, 2007లో పి.హెచ్‌డి పట్టాలను పొందింది. ఈమె 1999 నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 9 సంవత్సరాలు పనిచేసింది.
పిమ్మట 2008లో నాగార్జున విశ్వవిద్యాలయంలోని మహాయాన బౌద్ధ అధ్యయనాల కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలను అందించింది. 2011లో ప్రొఫెసర్‌గా పదోన్నతిని పొందింది.
Trio milova di sarah sechan biographyఈమె 81కి పైగా వివిధ సెమినార్లలో, వర్కుషాపుల్లో పాల్గొని పత్రసమర్పణ గావించింది. వివిధ పత్రికలలో బుద్ధిజం గురించి, జాషువా సాహిత్యం గురించి, దళిత రచయిత్రుల గురించి, గిరిజన సంస్కృతి గురించి ఇంకా వివిధ విషయాలపై 56కు పైగా వ్యాసాలను రచించింది. ఇంకా ఈమె "చారిత్రక పరిశోధన" అనే అర్ధవార్షిక పత్రికకు, "బహుజన కెరటాలు" అనే మాసపత్రికకు సంపాదకురాలిగా ఉన్నది.
"మన చరిత్ర - సంస్కృతి" మాసపత్రికకు, "Samanthara Voice" పత్రికకు సంపాదక వర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నది. ఈమె పలు సామాజిక, విద్యాసంబంధ సంస్థలలో సభ్యురాలిగా క్రియాశీలకంగా ఉంది.[2]
1.దళిత స్త్రీవాదం